రాళ్లపాడు మంచినీటి శుద్ధి పై త్వరితగతిన చర్యలు తీసుకోవాలి - అభివృద్ధి కమిటీ చైర్మన్ దివి శివరాం

0

 రాళ్లపాడు మంచినీటి శుద్ధి పై త్వరితగతిన చర్యలు తీసుకోవాలి 

చేపల పెంపకం పై పర్యవేక్షణ చేయాలి కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ దివి శివరాం 

తగిన చర్యలు తీసుకొని సాగు,తాగు నీటికి ఇబ్బంది లేకుండా చూస్తాం...సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ 


BSBNEWS - KANDUKUR

కందుకూరు నియోజకవర్గానికి సాగు, తాగునీటి సరఫరాకు  తలమానికమైన రాళ్లపాడు ప్రాజెక్టు నుండి నూటమూడు గ్రామాలకు పైగా మంచినీటి సరఫరా జరుగుతుందని మంచినీటిని శుద్ధి చేయడంలో సరైన మార్గదర్శకాలు చేపట్టడం లేదు శుద్ధి కార్యక్రమం త్వరితగతిన చేపట్టి గ్రామాలకు సురక్షిత నీటిని అందించి  ప్రజల ఆరోగ్య పరిరక్షణ చేయాలని కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ దివి శివరాం సోమవారం సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ను కోరారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజను కలిసి రాళ్ళపాడు ప్రాజెక్టు గురించి పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈమధ్య రాళ్లపాడు ప్రాజెక్టు సందర్శించినప్పుడు ప్రాజెక్టులో శుద్ధి ట్యాంకర్ దగ్గర నీటిని, సరఫరా కొళాయి దగ్గర నీటిని సేకరించి  టెస్టింగ్ కు పంపించడం జరిగిందన్నారు. తాగునీటికి  ఉండవలసిన క్వాలిటీ లేనందున ఆ రిపోర్ట్స్ ను సబ్ కలెక్టర్ కు అందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం కూడా నీటి నాణ్యతను పరిశీలించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాళ్లపాడు ప్రాజెక్టులో చేపలు సహజ సిద్ధంగా పెంచడం కాకుండా వ్యర్ధాలను తీసుకువచ్చి చేపలకు ఫీడింగ్ ఇవ్వటం ద్వారా నీరు కలుషితమై అనేక విధాల సమస్యలు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్నారని వివరించారు. చేపల పెంపకం పైన కూడా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. స్పందించిన సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టు పర్యవేక్షణకు అన్ని విధాలుగా తగిన చర్యలు తీసుకుని సాగు,తాగు నీటి సరఫరాకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చేస్తామని తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్స్ సబ్ కలెక్టర్ కు అందించిన వారిలో అభివృద్ధి మండలి ఉపాధ్యక్షులు షేక్ రఫీ, ట్రెజరర్ కాకుమాని మాధవరావు, గౌరవ సభ్యులు పోకూరి మాల కొండయ్య, తోకల వెంకటేశ్వర్లు, చింతరబోయిన నరేష్, గాండ్ల హరి ప్రసాదు, షేక్ జిలాని, అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)