వారికి అదే చివరి రోజు - సీఎం చంద్రబాబు
BSBNEWS - VIJAYAWADA
క్రిమినల్స్, రౌడీలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా రౌడీలు మీ ఇష్టప్రకారం చేస్తే అదే చివరి రోజు కావాలని మా ఆకాంక్ష అని అన్నారు. ఆ విధంగా మా పోలీస్ వ్యవస్థను తయారు చేస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, స్మగ్లింగ్ చేస్తూ మృగాలుగా మారుతున్నారని, ఆడబిడ్డలను లైంగికంగా హింసించి హత్య చేస్తున్నారని, ప్రతి ఒక్క కేసును సవాల్‌గా తీసుకొని, శాశ్వత పరిష్కారం చూపిస్తాం అని అన్నారు.

