ఎర్ర వాగు పరిశీలిస్తున్న ఎమ్మార్వో, సీఐ

0

 ఎర్ర వాగు పరిశీలిస్తున్న ఎమ్మార్వో, సీఐ

BSBNEWS - KANDUKUR 



కందుకూరులోని ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దాంతో వాహనదారులు, ప్రయాణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారు దగ్గరుండి ప్రయాణికులకు సూచనలు చేస్తున్నారు. ఇటీవల గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కందుకూరు నుండి గుడ్లూరు వెళ్లే రహదారిలో ఉన్న ఎర్ర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎర్రవాగును కందుకూరు తహశీల్దార్ ఇక్బాల్, కందుకూరు సీఐ కే. వెంకటేశ్వరరావు లు సందర్శించి ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. ఉధృతి తగ్గేంతవరకు ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)