రాళ్లపాడు ప్రాజెక్టు తాగు నీటిని శుద్ధి చేయాలి - దివి శివరాం
BSBNEWS - KANDUKUR
రాళ్లపాడు ప్రాజెక్టు నుండి ప్రజలకు అందించే తాగు నీటిని శుభ్రపరచాలని కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ దివి శివరాం ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావును కోరారు. బుధవారం కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ నాయకులు స్థానిక శాసనసభ్యులు కార్యాలయంలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావును కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కందుకూరు అభివృద్ధి మండలి సభ్యులు కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి రాళ్లపాడు రిజర్వాయర్ నుంచి 100 గ్రామాలు కి అందిస్తున్న మంచినీటి తాలూకా లాబ్ నివేదికని అందజేశారు. అనంతరం అభివృద్ధి కమిటీ చైర్మన్ దీవి శివరాం మాట్లాడుతూ ల్యాబ్ నివేదికలో రిజర్వాయర్ నుంచి వచ్చే నీరు కలుషితమైన నీరు అని తాగునీటికి పనికిరాదు అని, ఆ అందరికీ తెలిసినదే దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యేని కోరారు. ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి కమిటీ పని చేస్తుందని ఆయనకి వివరించారు. చెరువులో చేపల పెంపకం సంబంధించిన వ్యర్ధాలను వేయకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు మాట్లాడుతూ ప్రస్తుత కలుషిత నీరుకి కారణం నీటిని శుద్ధి చేసే పరికరాలు అని, వాటిని మార్చి 8 సంవత్సరాలు అయింది అని అన్నారు. గత ప్రభుత్వం పరికరాలు మార్చడం కోసం బిల్లులు కూడా పెట్టడం జరిగింది అని వివరణ ఇచ్చారు. చెరువులో వ్యర్ధాలు వేస్తున్నారు అన్న ప్రచారం మంచిది కాదు అని ఒకవేళ అదే జరిగితే ముందుగా స్పందించేది నేనే అని చెప్పారు. అభివృద్ధి కమిటీ కార్యదర్శి నేతి మహేశ్వర రావు మాట్లాడుతూ అభివృద్ధి మండలి లక్ష్యం కందుకూరి అభివృద్ధి అని, అభివృద్ధి మండలిని అభివృద్ధి కోణంలో ఆలోచించి అభివృద్ధి మండలి అంశాలను మీకు వచ్చే ఇంటిలిజెంట్స్ ఇచ్చిన రిపోర్టుగా భావించి పరిష్కరిస్తే ప్రభుత్వానికి ప్రజలకు మేలు జరుగుతుంది అని తెలిపారు. పాలేటి కోటేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధి మండలి లక్ష్యం కందుకూరి అభివృద్ధి తప్ప రాజకీయాలు కాదు అని ఒకవేళ టీడీపీ పార్టీలో అంతర్గత విబేధాభిప్రాయాలు ఉంటే మీరు కూర్చొని సర్దిద్దుకుంటే బాగుంటుంది అని అభివృద్ధి మండలి భావిస్తుంది అని అన్నారు. అభివృద్ధి మండలి సభ్యులు ఎమ్మెల్యేతో జరిగిన చర్చ మంచి వాతావరణంలో జరగడం శుభ పరిణామం అని అన్నారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ తప్పకుండా సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని అలాగే ఎవరైనా చెరువులో వ్యర్ధాలను వేసే పరిస్థితి ఉంటే ముందుగా నాకు సమాచారం ఇస్తే వాళ్ళని నేనే దగ్గరుండి అరెస్టు చేపిస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో కోశాధికారి కాకుమాని మాధవ, జాయింట్ సెక్రెటరీ బి సురేష్, అభివృద్ధి మండల సభ్యులు తోకల వెంకటేశ్వర్లు, నరేష్, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

