చుండి అయ్యవారిపల్లి గ్రామంలో మాలల చైతన్య సభల నిర్వహణ
BSBNEWS - CHUNDI
కందుకూరు నియోజకవర్గ మాలల చైతన్య సభల నిర్వహణలో భాగంగా శుక్రవారం 48వ చైతన్య సభ వలేటివారిపాలెం మండలంలోని చుండి అయ్యవారిపల్లి గ్రామం నందు గ్రామ పెద్దలు జి.మాల్యాద్రి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పెద్దల సహకారంతో గ్రామ కమిటీ నిర్వహించడం జరిగిందని అన్నారు. కమిటీ సభ్యులకు జై భీమ్ లు తెలుపుతున్నామన్నారు. అనంతరం కందుకూరు నియోజకవర్గ మాల ఉద్యోగుల సంఘ అధ్యక్షులు చిడితోటి శ్రీరాములు, వలెటివారి పాలెం మండల మాల ఉద్యోగుల సంఘ ఉపాధ్యక్షులు బీరకాయల మాధవ, మాల ఉద్యోగుల సంఘ సెక్రటరీ మద్దులూరి రమణయ్య, జనరల్ సెక్రటరీ పొనుగోటి రామారావు, నియోజకవర్గ మాల ఉద్యోగుల సంఘ కో-ఆర్డినేటర్ చనమాల కోటేశ్వరరావులు మాలల భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక కై దిశా -నిర్దేశం చేశారు.ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు, కె.భాస్కర్, యువకులు, మహిళలు, విద్యార్థులు సభ లో పాల్గొని జయప్రదం చేశారు.

