నూతన రోడ్లకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు

0

 నూతన రోడ్లకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు

BSBNEWS -  MUTYAIAPADU 



పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో భాగంగా శనివారం మండలంలోని ముత్యాలపాడు పంచాయతీలో 21.33 లక్షల రూపాయలతో, పెదపవని పంచాయతీలో 12.67 లక్షల రూపాయలతో, చినపవని పంచాయతీల్లో 26.77 లక్షల రూపాయలతో  నూతన రోడ్డు పనులకు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాలు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గ్రామ స్థాయిలో  తీసుకున్న తీర్మానాలతో మన నియోజకవర్గంలో 15 కోట్ల రూపాయల తో నూతన సి.సి రోడ్లు పనులను ప్రారంభించినట్లు తెలిపారు. రాబోయే రోజులలో  అన్ని పంచాయతీల్లో సిసి రోడ్లను వేసి ప్రజల సౌకర్యార్ధం రోడ్ల సమస్య లేకుండా చేస్తామని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఇ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీ తుమాటి గిరిజమ్మ, నాయకులు యల్లావుల మాధవ, గొర్రెపాటి సాంబయ్య, మోతుకూరి పర్వతాలు, కంకణాల సుబ్బులునాయుడు, భత్తుల శ్రీనివాసులు, ఏపూరి పద్మారావు, షేక్ నాయబ్ రసూల్, ఎస్కే రఫీ, కరిముల్లా సిద్దయ్య, సోంపల్లి మనోహర్ కేశినేని నాగేశ్వరరావు, ఉమ్మనేని నరసింహారావు,  ముల్లపాటి చౌదరి, బోయపాటి వెంకటేశ్వర్లు, గొర్రెపాటి శ్రీను అన్ని గ్రామ పార్టీల అధ్యక్షులు అనుబంధ సంఘాల సభ్యులు జనసేన బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)