రాళ్లపాడు రిజర్వాయర్ ను సందర్శించిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు

0

రాళ్లపాడు రిజర్వాయర్ ను సందర్శించిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు 


BSBNEWS - లింగసముద్రం [19.10.2024]

మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్ట్ ను శనివారం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా  ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటిమట్టం సుమారు 15 అడుగుల నీరు చేరిందని అధికారులు ఎమ్మెల్యేకి తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ సోమశిల ప్రాజెక్టు నుంచి ఉత్తర కాలువ ద్వారా ఎంత మేర నీరు ప్రాజెక్టులోకి చేరుతుందని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాళ్లపాడు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు నీరు చేరిన తర్వాత గేట్లు తెరిచి నీరు క్రింది వైపుకు విడుదల చేయ సందర్భంలో మన్నేరు పరివాహక ప్రాంత గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాళ్లపాడు ప్రాజెక్టు అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)