సిపిఐ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 137వ వర్ధంతి వేడుకలు

0

 సిపిఐ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 137వ వర్ధంతి వేడుకలు

BSBNEWS - KANDUKUR 

స్థానిక సిపిఐ కార్యాలయంలో కందుకూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి బి.సురేష్ బాబు ఆధ్వర్యంలో గురువారం భారత సమాజ తొలి సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 137వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పోకూరి మాలకొండయ్య హాజరయ్యారు. అనంతరం పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఆయన ఆశయాలు కొనసాగిస్తామని సామాజిక విప్లవాన్ని సాధిస్తామని సిపిఐ నాయకులు నివాళులర్పించారు. అనంతరం మాలకొండయ్య మాట్లాడుతూ శతాబ్దం క్రితం భారత సమాజంలో సామాజిక అసమానతలు బడుగు బలహీన వర్గాలపై దురాగతాలు, దాడులు మహిళలు వంటింటికే పరిమితమైన ఆనాటి సమాజానికి ముఖ్యంగా బలహీన వర్గాలకు దిక్సూచిగా ఫూలే తన అడుగులు సామాజిక విప్లవం వైపు వేసి ఆధునిక భారత సమాజంలో తొలి సామాజిక విప్లవకారుడుగా తుదిశ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం అడుగులు వేశారని అన్నారు. మహిళలు వంటింటికే పరిమితమైన కాలంలో తన భార్యకే విద్య నేర్పి భారత దేశంలో తొలి మహిళ పాఠశాల ఏర్పాటు చేసిన మహిళా పక్షపాతి అని కొనియాడారు. ఆయన అందించిన ఆ ఉద్యమ స్ఫూర్తి సామాజిక హక్కుల సాధన నేటికీ నా నాటికి నేటికి భవిష్యత్తుకు గొంతుకై తమ హక్కుల సాధన కోసం బలహీనవర్గాలు ముందుకు సాగటం ఆయన అందించిన స్ఫూర్తి అని అన్నారు. అలాంటి ఫూలే ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుపోవాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి యర్రంశెట్టి ఆనందమోహన్, సిపిఐ నాయకులు లక్ష్మీనారాయణ, ఉప్పుటూరి మాధవరావు, నీలి శెట్టి నరసయ్య, దుర్గాప్రసాద్, బాల బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)