ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై రెండవరోజు ఎంప్లాయిస్ యూనియన్ నిరసన

0

 ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై రెండవరోజు  ఎంప్లాయిస్ యూనియన్ నిరసన 

BSBNEWS - KANDUKUR 

ఎంప్లాయిస్ యూనియన్ డిపో కమిటీ పిలుపు మేరకు కందుకూరు డిపోలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై బుధవారం రెండవ రోజు  డిపో అధ్యక్షుడు ఎం. మహేష్ అధ్యక్షత న గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి ఎమ్.ఎస్. ఎన్. రాజు మాట్లాడుతూ డిపోలో డ్రైవర్లు, కండక్టర్ ల డ్యూటీ చార్ట్ లు వేసి 3 సంవత్సరాలు అవ్వటం వలన కొత్తగా డ్యూటీ చార్ట్ లను వేయాలని, డిపో నందు ఆటోలు ప్రయాణీకులను ఎక్కించుకుని ఆర్టీసి ఆదాయానికి గండి గండికొడుతున్నందున అక్రమ రవాణాను అరికట్టాలని, కోరారు. రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డి. వై.కొండలు మాట్లాడుతూ వెహికల్ కండీషన్ మెరుగు పరచాలని, 1/19 సర్కులర్ ను అమలు పరచాలని, కొత్తగా ప్రవేశ పెట్ట దలచుకున్న ఓ.టి డ్యూటీ లను రద్దు చేయాలని అన్నారు. రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ బాబు రావు మాట్లాడుతూ డిపోలో ఉద్యోగులకు తాగునీటి వసతి కల్పించాలని, ఉద్యోగులపై పనిభారం తగ్గించి సమాన పనికి సమాన పనిగంటలు ఉండేలా చార్ట్ లు వేయాలని కోరారు. రీజినల్ సహాయ కార్యదర్శి వై. సదానందం మాట్లాడుతూ ఉద్యోగుల విశ్రాంతి గదులను శుభ్రపరచి నీటి సౌకర్యం కల్పించాలని అన్నారు. సి. సి. ఎస్. డెలికేట్ సుబ్బారావు మాట్లాడుతూ గ్యారేజ్ నందు ఎలెక్ట్రిషన్ సీనియారిటీ ప్రకారం ఫిక్స్ డ్ గా నియమించాలని, గ్యారేజ్ నందు, సిబ్బంది డైనింగ్ హల్ నందు త్రాగునీటి వసతి కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్. బాబురావు, గ్యారేజ్ నాయకులు రహంతుల్లా, స్వామి, రవి, సుబ్బారావు, డిపోకమిటి ట్రెజరర్ వెంకటేశ్వర్లు, మహిళా నాయకులు విజయలక్ష్మి, ఉమాదేవి, మోహన్ రావు, వై.మాధవ రావు, మల్లిఖార్జున, ఎం.కొండల్ రావు, డి.కృష్ణ, హరికృష్ణ, సిహెచ్ కృష్జ, టి.మాధవ రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)