ఎరువుల దుకాణాలు తనిఖీ
BSBNEWS - KANDUKUR
పట్టణంలోని అన్ని ప్రైవేటు ఎరువులు షాపులను మండల వ్యవసాయాధికారి వి.రాము ఆధ్వర్యంలో నెల్లూరు భూసార పరీక్ష సహాయ వ్యవసాయ సంచాలకులు కె. కన్నయ్య గురువారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధీకృత ఎరువుల తయారీ నుండి లైసెన్సు నందు పొందుపరచని ఫారం ఓ ఎరువులను, ఈ పాస్ మిషన్ లోని నిల్వలు, రిజిష్టర్ లోని నిల్వలు సరిగా లేనియెడల 1985 ఎరువుల చట్టం, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారికి సూచించారు. ప్రవేటు డీలర్లు అందరూ షాపుల ముందు డీలర్ షాపు పేరు, లైసెన్సు నంబర్, అడ్రస్ బోర్డు చూపించాలని, తప్పనిసరిగా మీ యెుక్క లైసెన్సు లో ఎరువులను సరఫరా చేసే కంపెనీల ఉత్పత్తులను ఫారం ఓ ద్వారా పొందుపరచుకోవాలని, ఎరువులు ఎం ఆర్ పి రేట్లకు మాత్రమే విక్రయించాలని, రైతుకు రశీదు ఇవ్వాలని, నోటీసు బోర్డు లో అమ్మకపు రెట్లు, నిల్వ చూపించాలని, బిల్ బుక్ లో రైతు సంతకం, డీలర్లు సంతకం వుండాలని, పాస్ పుస్తకంలో రైతు విస్తీర్ణం బట్టి, బయోమెట్రిక్ ఆధారంగా వేలిముద్ర వేసుకొని ఎరువులను పంపిణీ చేయాలని తెలియజేసారు. లేనిచో అట్టి వారిపై ఎరువుల చట్టం 1985 ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తదుపరి ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా నిల్వ ఉన్న ఎరువులు మరియు భౌతికంగా నిల్వ ఉన్న ఎరువులను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల వివరాలు రైతులు గమనించి నిబంధనలు ఎవరైనా పాటించకపోతే వ్రాత పూర్వకంగా మీ మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేసి, తగు సూచనలు సలహాలు పొందవచ్చని తెలియజేసారు.


.jpeg)
