ఈనెల 15వ తేదీ వరకు ప్రత్యేక పోస్టల్ క్యాంపులు
BSBNEWS - KANDUKUR
తపాలా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 వరకు ఆధార్ లింక్ కై ప్రత్యేక క్యాంపు లను నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ఐపిపిబి ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కందుకూరు అసిస్టెంట్ సూపర్నెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అధికారి సిహెచ్ మారుతి మధు వాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తపాల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి గ్రామ వార్డు సచివాలయాల సహకారంతో తపాల సిబ్బంది ద్వారా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా కొత్త ఖాతాలను తెరవడం కోసం ఆధార్ లింకు చేయడం తప్పనిసరి అని అందుకోసం ప్రత్యేక క్యాంపులను కందుకూరు సబ్ డివిజన్ పరిధిలోని 100 తపాలా బ్రాంచ్ ఆఫీసులు, సబ్ పోస్ట్ ఆఫీసులు, హెడ్ పోస్ట్ ఆఫీస్ ల ద్వారా ఆయా పట్టణ, గ్రామాలలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నామని వాటిని ప్రతి ఒక్క లబ్ధిదారుడు వినియోగించుకోవాలని అన్నారు. ఈ శిబిరాలలో ఇప్పటికే ఉన్న ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ చేయడం, కొత్త ఐపిపి ఎకౌంటులను ఆధార్ లింకుతో ఓపెన్ చేయడం ద్వారా ఎన్ పి సి ఐ- నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మ్యాపింగ్ సులభతరం అవుతుందన్నారు. ప్రస్తుతం కందుకూరు సబ్ డివిజన్ పరిధిలోని ఇనాక్టీవ్ స్టేజిలో ఉన్న 34,000 మంది ఎంపీసీఐ బెనిఫిట్స్ పునరుద్ధరించడానికి ఈ స్పెషల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఐపిపిబి ప్రీమియం ఖాతా ఆధార్ సీడింగ్ తెరవడానికి కేవలం 18 సంవత్సరాలు నిండి, 200 రూపాయలతో ఆధార్, మొబైల్ నెంబర్ సహాయంతో అతి తక్కువ సమయంలోనే మీ ఐపిపిబి ఖాతాలను తెరవచ్చు అని అన్నారు. తద్వారా ఎన్.పీ.సీ.ఐ మ్యాపింగ్ పొంది లబ్ధిదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లభించే డైరెక్ట్ బెనిఫిట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వారి అకౌంట్లో నేరుగా జమ చేయబడతాయన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన పౌరులందరూ ప్రభుత్వ ప్రయోజనాలను తమ ఖాతాలో జమ చేయబడేలా ఖాతాలను ఆధార్ లింక్ చేయించుకుంటూ, కొత్త ఐపిపిబి ప్రీమియం ఖాతాలు తెరవటానికి తమకు దగ్గర్లోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో, సబ్ పోస్ట్ ఆఫీస్ లో, హెడ్ పోస్ట్ ఆఫీస్ లను వెంటనే సంప్రదించవలసిందిగా ఆమె తెలిపారు.

