పర్చూరు ఏపీఓ పై జరిగిన దాడిపై ఖండన

0

పర్చూరు ఏపీఓ పై జరిగిన దాడిపై ఖండన

BSBNEWS - పొన్నలూరు

పర్చూరు మండలం ఉపాధి హామీ పథకం ఏపీఓ బుల్లయ్య, సిఓ ఖాజమొహిద్ధీన్ లపై జరిగిన కత్తి దాడిని పొన్నలూరు మండలం ఉపాధి హామీ పథకం సిబ్బంది మంగళవారం ఖండిస్తూ ఒక ప్రకటనలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపట్ల జిల్లా పర్చూరు మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లో విధులు నిర్వహిస్తున్న ఏపీవో బి. బుల్లయ్య, కంప్యూటర్ ఆపరేటర్ ఖాదర్ మొయిద్దీన్ లపై కొంతమంది తమ మాట వినలేదని దురుద్దేశంతో కత్తితో దాడి చేయడం సరికాదని వారు అన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగరీత్యా తమ విధులను నిర్వర్తిస్తుంటే దాడి చేయటం సరికాదని, ఇదే విధంగా కొనసాగితే ప్రభుత్వ ఉద్యోగి ఎక్కడ తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేరని వారు అన్నారు. దాడి చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగికి రక్షణ కల్పించాలని వారు కోరారు. నీరసం తెలిపిన వారిలో పొన్నలూరు మండలం ఏపీవో మాచర్ల సిబ్బంది తదితరులు ఉన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)