రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

0

రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

రాళ్లపాడు ఆయకట్టు రైతుల పొలాలకు కాలువల ద్వారా నీరు విడుదల

ఆనందం వ్యక్తం చేసిన రాళ్లపాడు ఆయకట్టు రైతాంగం

ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపిన రాళ్లపాడు ఆయకట్టు రైతాంగం

BSBNEWS - LINGASAMUDRAM 

మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద మంగళవారం రాళ్లపాడు ఆయకట్టు రైతులు, అధికారులతో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కలిసి ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాజెక్ట్ గేట్లు తెరిచి కాలువల ద్వారా  నీటిని విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులో నీరు చేరిందని, సోమశిల ప్రాజెక్టు నుంచి మనకు రావాల్సిన 1.5 టిఎంసిల నీరు కూడా ప్రాజెక్టుకు వస్తుందని దీని ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటిమట్టం చేరుకుంటుందని తెలిపారు. ఈ సీజన్లో ఆయకట్టు రైతులు వరి పంట పండించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా  రైతుల ఆకాంక్షకు అనుగుణంగా ప్రాజెక్ట్ నుంచి రైతుల పొలాలకు కాలువ ద్వారా నీటిని విడుదల చేయటం ఒక రైతు బిడ్డగా తనకు ఎంతో ఆనందం కలిగించిందని ఆయన తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీరు రాక వరి పంటను సాగు చేయలేకపోయారని,  కానీ ఈ సీజన్లో వరి పంటకు చివరి ఆయకట్టు పొలం వరకు నీరు అందించే  బాధ్యత తీసుకుంటానని ఆయకట్టు రైతులకు ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచనలతో ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలకు అమలు చేసే విధంగా బడ్జెట్ రూప కల్పన చేయటం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ కేటాయింపులు చేసిందని తెలిపారు. గత జగన్ సర్కార్ 2023 - 24 లో సాగునీటి కోసం కేటాయించింది కేవలం 697 కోట్లు మాత్రమేనని, కానీ ప్రస్తుత ప్రభుత్వం 1447.20 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సోమవారం మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారన్నారు. ఈ బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కు 4500 కోట్లు కేటాయింపు జరగడం జరిగిందని, ఈ పథకం ద్వారా  రాష్ట్రంలోని ఒక్కొక్క రైతు ఖాతాలో ప్రతి సంవత్సరం 20 వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా రాళ్లపాడు ఆయకట్టు రైతాంగం ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఒంగోలు సర్కిల్  ఎస్.ఈ వరలక్ష్మి, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, మండల తెలుగు రైతు అధ్యక్షులు మద్దెల రామారావు, టిడిపి,బిజెపి,జనసేన నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రాజెక్టు అధికారులు, రాళ్లపాడు ఆయకట్టు రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)