అఖిల భారత 21 వ పశుగణన పారదర్శకంగా చేయాలి

0

 అఖిల భారత 21 వ పశుగణన పారదర్శకంగా  చేయాలి

BSBNEWS - KANDUKUR 


అఖిల భారత 21 వ పశు గణన పారదర్శకంగా చేయాలనీ డివిజన్ లో నియమించిన 69 ఎన్నుమారేటర్స్ లు డివిజన్ లోని 1,10,204 గృహలలో పశు గణన చేయాలనీ నెల్లూరు జిల్లా జే.డి కె.రమేష్ నాయక్ చెప్పారు. స్థానిక కందుకూరు డివిజన్ పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు వారి కార్యాలయంలో డివిజన్ లోని ఏడిఎస్, పశు వైద్యులతో సమీక్ష సమావేశం ఉపసంచాలు డాక్టర్ జి.శ్రీధర్ రావు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా నెల్లూరు జిల్లా జెడి కె.రమేష్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ అఖిల భారత 21 వ పశు గణన కార్యక్రమం 28-02-2025 వరకు జరుగుతుంది అని చెప్పారు. 4-8 నిండిన ఆడ దూడలకి బృసెల్లోసిస్ టీకాలు వేయాలని, ఆంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కాంపెయిన్ లో భాగంగా ఆంటీ బయోటిక్స్ ని అవసరమైన మేరకే వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు, డాక్టర్ పి.శ్రీనివాసులు, డాక్టర్. చైతన్య కిషోర్, డాక్టర్. మంజునాథ్, డాక్టర్. వై. శ్రీకాంత్, డివిజన్ పశువైద్యులు, పారా సిబ్బంది, ఏ హెచ్ ఏ ఎస్ లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)