తన్నీరు కొండలరావు కుటుంబ సభ్యులకు అండగా జనసేన కనపర్తి మనోజ్ కుమార్
BSBNERWS - PONNALUR
మండలంలోని పెద్దవెంకన్నపాలెం గ్రామానికి చెందిన తన్నీరు కొండలరావు కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ అన్నారు. ఇటీవల కొండలరావు పెద్దవెంకన్నపాలెం గ్రామంలో ఆగస్టు 29న పెద్ద నీటిబావిలో దూకి మరణించాడని, అతని మరణానికి తన్నీరు అశ్విని, తన్నీరు వెంకట్రావు, కుంచాల శ్రీను, కుంచాల జ్యోతి లు ప్రధాన కారణం అని వారిపై మాకు అనుమానం ఉందని జనసేన జనవాణి ద్వారా మాకు న్యాయం చేయాలని కొండలరావు కుటుంబ సభ్యులు తనని కలవడం జరిగిందన్నారు. కాల్ ఆడియో రికార్డులు, ఫోన్ నెంబర్లు ఆధారాలను బట్టి వారు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అని ఆయన అన్నారు. జనసేన పార్టీ తరఫున కొండలరావు మృతికి గల కారణాలను బయట పెట్టేలా పోలీసులతో మాట్లాడి కొండలరావు కుటుంబ సభ్యులకు జాయిన్ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

