పార్టీ సభ్యత్వం నమోదులో అయ్యవారిపల్లి తెలుగు తముళ్ల జోరు
BSBNEWS - VALETEVARIPALEM
మండలంలోని అయ్యవారిపల్లి పంచాయతీ రామలింగాపురం గ్రామంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు మాదాల లక్ష్మీ నరసింహ ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ సభ్యత్వం నమోదులో తెలుగు తమ్ముళ్ళ జోరు కొనసాగుతుంది. ఈ సందర్భంగా మాదాల లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ ఈ సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరిస్తూ ముమ్మరంగా సభ్యత్వంలు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ సభ్యత్వం కార్యక్రమంలో అయ్యవారిపల్లి డీలర్ పాలేటి రవి, ఫీల్డ్ అసిస్టెంట్ మంచాల మాలకొండ రాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు వేమూరి రాజా, మంచాల హరిబాబు, యల్లంపల్లి భరత్ కుమార్, ఉప్పుటూరు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

