రహదారులతో గ్రామాలకు మహర్దశ- ఎమ్మెల్యే ఇంటూరి

0

రహదారులతో గ్రామాలకు మహర్దశ- ఎమ్మెల్యే ఇంటూరి

BSBNEWS - KANDUKUR



రహదారుల అభివృద్ధితోనే గ్రామాల అభివృద్ధి ముడిపడి ఉందని అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు అన్నారు. లింగసముద్రం మండలం మేదరమెట్ల పాలెం పంచాయితీ లోని బస్సు షెల్టర్ వద్ద నుంచి పెదపవని గ్రామానికి వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు మరమ్మత్తుల కార్యక్రమానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. మేదరమిట్లపాలెం గ్రామ ప్రజలు, టిడిపి నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసించి కూటమి ప్రభుత్వాన్ని ప్రజల గెలిపించుకున్నారని, వారి నమ్మకాన్ని నిలబెడుతూ గెలిచిన 100 రోజులు లో అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేక ఎక్కడికి అక్కడ రోడ్లన్నీ గుంతల మయమయ్యాయని, రహదారులపై ప్రయాణం చేయాలంటే ప్రజలు నరకం చూశారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్రాంతి పండుగ నాటికి గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్  లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గంలో గుంతల రహిత కందుకూరును ప్రజలు త్వరలో చూడబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కూరపాటి భాస్కర్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ ప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చక్రధర్, గ్రామ సర్పంచ్ కూరపాటి మాధవి, పార్టీ నాయకులు కూరపాటి శీను, రమేష్, షేక్ నాయబ్ రసూల్, గొర్రెపాటి సాంబయ్య, సోంపల్లి మనోహర్, అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల సభ్యులు టిడిపి బిజెపి జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)