మాల ధారణ స్వాములకు అన్న ప్రసాద వితరణ ప్రారంభం
BSBNEWS - KANDUKUR
కందుకూరు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీకమాస ప్రారంభం సందర్భంగా శనివారం మాల ధారణ భక్తులకు శ్రీ అయ్యప్ప స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణము ప్రారంభించారు. అంతకుముందు పూజా కార్యక్రమం నిర్వహించి మాల ధారణ స్వాములకు అన్న ప్రసాద వినియోగం చేశారు. మొదటి రోజు అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ గత 18 సంవత్సరాల నుంచి దాతల సహాయ సహకారంతో అన్న ప్రసాద వినియోగాన్ని ప్రతి కార్తీక మాసంలో మాల ధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎంతమంది వచ్చినా అన్న ప్రసాదం లేదనకుండా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం దాతల సహాయంతో మాల ధారణ భక్తులకు అన్న ప్రసాద వినియోగ నూతన భవనాన్ని, మినీ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థల దాతలు మందలపువారి కుటుంబ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ దివి లింగయ్య నాయుడు, పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కే .ఎస్ .వెంకటేశ్వర్లు(గురుస్వామి) ఇస్కాల.వెంకట నరసింహ నల్లబోతుల.మురళి, మాదాలవెంకటేశ్వర్లు, కాటా.చెంచురామయ్య, దాసరి.శ్రీనివాసులు, ఉన్నం.వీరాస్వామి, వాకా రాజారెడ్డి, ఆర్యవైశ్య మీడియా చైర్మన్ చక్కా వెంకట కేశవరావు తదితరులు పాల్గొన్నారు.


