అసమానత సమాజంలో సమత సాధించాలంటే బౌద్ధం ఆవశ్యముంది

0

 అసమానత సమాజంలో సమత సాధించాలంటే బౌద్ధం ఆవశ్యముంది

 ఉపాసకులు గాండ్ల హరిప్రసాద్ 

 దమ్మ చక్ర ఫౌండేషన్ అధ్యక్షులు

BSBNEWS - SINGARAYAKONDA



 సింగరాయకొండ దమ్మ చక్ర బుద్ధ విహార ట్రస్ట్ ఆధ్వర్యంలో నేటి సమాజంలో బౌద్ధ ఆవశ్యకత అనే అంశంపై బుద్ధ విహార ట్రస్ట్  అధ్యక్షులు అల్లు వెంకటేశ్వర అధ్యక్షత అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాసక గాండ్ల హరి ప్రసాద్ మాట్లాడుతూ నేటి అసమాన సమాజంలో సమతా సౌభాతృత్వాలు సాధించాలంటే మహోన్నత మానవీయకోణమున్న బౌద్ధిజం ఆచరణ ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. సమాజంలో పెట్రేగిపోతున్న హింస దౌర్జన్యం దోపిడీ కుల మత ప్రాంతీయ తత్వాలను ఎదుర్కొనే సమతా భావంతో మానవులందరూ కలిసి జీవించాలంటే బౌద్ధమే శరణ్యమని అన్నారు. ఇదే సదస్సులో భారత ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మూడు చట్టాలపై అవగాహన కల్పిస్తూ సీనియర్ న్యాయవాది పోకూరి కోటయ్య మాట్లాడుతూ ఇండియన్ పీనల్ కోడ్ పనికి రాదని నూతనంగా తీసుకువచ్చిన చట్టాలు సామాజిక దృక్పథం కొరవడి ఉన్నాయని, నూతన చట్టాలు పోలీసులకు, అధికారులకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టడం పౌర స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని తెలిపారు. సదస్సులో నూతనంగా ప్రచురితమైన మూడు పుస్తకాలను ఆవిష్కరించి పరిచయం చేయడం జరిగినది. డాక్టర్ మర్రి ధనుంజయుడు రచించిన ధనంజయం , న్యాయవాది ముప్పవరపు కిషోర్ రచించిన పాలపిట్ట దీర్ఘ కావ్య , మోర్తా జగన్నాథరావు రచించిన బౌద్ధం విజ్ఞాన రత్నాలు అనే పుస్తకాలను  ఆవిష్కరించారు. పుస్తక సమీక్ష నిర్వహిస్తూ రచయిత ముప్పవర కిషోర్ మాట్లాడుతూ సమాజంలో మానవత్వాన్ని మేల్కొపాలంటే బౌద్ధం నేర్పిన తాత్విక ధోరణిలో పలు రచనలు విస్తృతంగా రావాలని, సమాజాన్నీ సంస్కరించే వీచికలుగా పని చేయాలని అన్నారు. నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ శేషగిరిరావు మాట్లాడుతూ సమాజంలో ఉన్న రుగ్మతలకు అసమానతులకు బౌద్ధం ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేశారు. పి ఎం సి కళాశాల ప్రిన్సిపల్ దమ్మాల నాగేశ్వరావు మాట్లాడుతూ  బౌద్ధం వెలుగులో అంబేద్కర్ ఆశించిన రాజ్యాన్ని సాధించాలని అభిప్రాయపడ్డారు. ముందుగా భగవాన్ బుద్ధుని విగ్రహానికి నివాళి అర్పిస్తూ  పంచశీల, అష్టాంగ మార్గాలను సరణం చేయడం జరిగినది. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు అల్లు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతినెల దమ్మచక్ర బుద్ధ విహార  ట్రస్ట్ ఆధ్వర్యంలో బౌద్ధ తాత్విక సామాజిక నేపథ్యంతో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహిస్తామని అందరూ పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు పులగూర కృష్ణయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కోతల ప్రసాద్ రావు, దేవరకొండ శ్రీనివాసులు, ఎస్ కే సుల్తాన్ భాష, ఎర్రమాల సుబ్బారావు, ముతకాని లక్ష్మీనారాయణ, వై. ఉజ్వల్  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)