అంకభూపాలపురంలో ముమ్మరంగా టిడిపి సభ్యత నమోదు
BSBNEWS - VALETIVARIPALEM
మండలంలోని అంక భూపాలపురం గ్రామంలో కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు చెంచు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ముమ్మరంగా రెండో రోజు సభ్యత నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చెంచు శ్రీనివాసులు మాట్లాడుతూ టిడిపి సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులుగా చూస్తూ వారికి ఆపద సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ సభ్యత నమోదు ద్వారా ఆదుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు బక్క మంతల మాల్యాద్రి, డీలర్ పంది. లక్ష్మీనారాయణ, పేరుబోయిన వెంకటరత్నం, బిల్డర్ చెంచు. శ్రీనివాసరావు, బత్తుల సైదులు, బత్తుల. చిన్న వెంకటేశ్వర్లు, మంగీ సురేష్, బత్తుల. రాములు, మంగి.లాజరు, మల్లెల. అంకయ్య, బింగినేని. మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు

