పంట పొలాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి
BSBNEWS - KANDUKUR
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు మినుము, వరి, పొగాకు, మిరప పంటలలో నీరు నిల్వ ఉండకుండా కాలువలు తీసుకొని నీటిని బయటకు పంపాలని మండల వ్యవసాయ అధికారి వి.రాము తెలిపారు. మండలంలోని కోవూరు, పందలపాడు గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయాధికారి వి.రాము ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వి.రాము మాట్లాడుతూ శనగ, మిరప, పొగాకు వేసుకొనే రైతులు నేల బాగా ఆరనిచ్చి తర్వాత ట్రైకోడర్మా విరిడి అను జీవసిలేంద్రంతో విత్తన శుద్ది చేసుకొని విత్తుకోవాలి అని వివరించారు. పొగాకు పంట అధికంగా వేయకుండా ప్రత్యామ్నాయ పంటలుగా శనగ, జొన్న, సజ్జ, కొత్తిమీర, పంటలతో పంట మార్పిడి చేసుకోవాలని తద్వారా వేరు కుళ్ళు, ఎండు తెగులు రాకుండా కాపాడుకోవచ్చని సూచించారు. ఒకే పంట కాకుండా వివిధ రకాల పంటలను వేసుకోవడం వలన రైతులకు నష్టం రాకుండా వుంటుందని తెలిపారు. అనంతరం వరి పంటను పరిశీలించారు. కోవూరు పశు వైద్యాధికారి డాక్టర్ ఎస్ సుధాకర్ మాట్లాడుతూ ఉపాధి హామీలో నీటి వసతి వున్న రైతులు నూరు శాతం రాయితీతో బహు వార్షిక పశు గ్రాసం, సూపర్ నేపియర్ గడ్డి వేసుకోవడం వల్ల ఎక్కువ దిగుబడి, పాల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఉప సర్పంచ్ కాకుమాని వెంకటేశ్వర్లు, గ్రామ వ్యవసాయ సహాయకులు ఎం.నాగరాజు, జి రోజి రెండు గ్రామాల రైతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

.jpeg)
