అంకభూపాలపురంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు
BSBNEWS - VALETIVARIPALEM
మండలంలోని అంకభూపాలపురం గ్రామంలో కందుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు అంకభూ పాలపురం తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు చెంచు శ్రీనివాసులు ఆధ్వర్యంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 రోజుల నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. సభ్యత్వ నమోదు వలన కలిగే ప్రయోజనాలను కార్యకర్తలకు తెలియజేస్తూ ముందు సాగుతున్నామన్నారు. వ లేటివారిపాలెం మండలంలో తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదులో అంక భూపాలపురం గ్రామాన్ని మొదటి స్థానంలో నిలుపుతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు బక్కమంతల.మాల్యాద్రి, డీలర్ పంది.లక్ష్మీనారాయణ, ఎంపీయుపి పాఠశాల చైర్మన్ కుతారి. రమేష్ తదితరులు పాల్గొన్నారు

