అయ్యవారిపల్లెలో బాలల దినోత్సవం

0

 అయ్యవారిపల్లెలో బాలల దినోత్సవం

BSBNEWS -VALETEVARIPALEM 

మండలంలోని అయ్యవారిపల్లి ఎంపీ యూపీ పాఠశాలలో గురువారం బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు మాట్లాడుతూ నెహ్రూ పుట్టినరోజుని భారతదేశం అంతట బాలల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఆయన మొదటి ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలందించి అనేక సంస్కరణలు ప్రాజెక్టులు విద్యారంగ సంస్థలు కట్టించి ప్రజలకి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తిగా ఆయన గురించి మనం గొప్పగా చెప్పుకోవచ్చు అన్నారు. 1889వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోని అలహాబాద్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి నెహ్రూ చిన్నతనము నుండి చాలా చురుగ్గా అనేక పాఠశాలలో చదువుకొని ఉన్నత విద్యాభ్యాసం కోసం త్రినిధి క్రీం బ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువులు చదువుకున్నారన్నారు. విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత భారతదేశంలో ఉండే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని అనేకసార్లు జైలు కూడా వెళ్లి, స్వాతంత్ర కాంక్ష రగిలించాడన్నారు. స్వాతంత్రానంతరం భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా తన సేవలందించినటువంటి వ్యక్తిగా మనం ఆయన గురించి చెప్పొచ్చు అని అన్నారు. 17 సంవత్సరాల పాటు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ప్రజలకు సేవలు అందించినటువంటి వ్యక్తిగా ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరు నెరవేర్చే విధంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు పద్మప్రియ, రజిత, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)