ఎరువుల దుకాణంలో తనిఖీలు

0

 ఎరువుల దుకాణంలో తనిఖీలు  

BSBNEWS -  VALETEVARIPALEM 

మండల పరిధిలోని బడేవారిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ( పిఎసిఎస్ బడేవారిపాలెం ) అన్ని ప్రైవేటు  ఎరువులు, పురుగు మందుల షాపులను మండల వ్యవసాయాధికారి ఎం హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో కావలి సహాయ వ్యవసాయ సంచాలకులు (ఎ డి ఎ)డాక్టర్ సి హెచ్ నాగరాజు  తనిఖీ చేసి సంబంధిత పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ప్రవేటు డీలర్లు అందరూ షాపుల ముందు డీలర్ షాపు పేరు, లైసెన్సు నంబర్, అడ్రస్ బోర్డు చూపించాలని, తప్పనిసరిగా మీ యెుక్క లైసెన్సులో ఎరువులను సరఫరా చేసే కంపెనీల ఉత్పత్తులను ఫారం ఓ ద్వారా పొందుపరచుకోవాలని అన్నారు.  ఎరువులు ఎం ఆర్ పి రేట్లకు మాత్రమే విక్రయించాలని, రైతుకు రశీదు ఇవ్వాలని, నోటీసు బోర్డు లో అమ్మకపు రెట్లు, నిల్వ చూపించాలని, బిల్ బుక్ లో రైతు సంతకం, డీలర్లు సంతకం వుండాలని, పాస్ పుస్తకంలో రైతు విస్తీర్ణం బట్టి, బయోమెట్రిక్ ఆధారంగా వేలిముద్ర వేసుకొని ఎరువులను పంపిణీ చేయాలని తెలియజేసారు. నిబంధనలను పాటించని వారిపై ఎరువుల చట్టం 1985 ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తదుపరి ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా నిల్వ ఉన్న ఎరువులు, భౌతికంగా నిల్వ ఉన్న ఎరువులను పరిశీలించారు. నిబంధనలను ఎవరైనా పాటించకపోతే రైతులు వ్రాత పూర్వకంగా సంబంధిత మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేసి, తగు సూచనలు సలహాలు పొందవచ్చని తెలియజేసారు.

Post a Comment

0Comments
Post a Comment (0)