మహిళా కండక్టర్ పై పైశాచిక దాడిని ఖండించిన సిపిఐ నాయకులు
BSBNEWS - KANDUKUR
మహిళ కండక్టర్ పై పైశాచిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ తెలిపారు. బాధితురాలు సిహెచ్ సుభాషిణి నీ సిపిఐ, ఏఐటియుసి, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కందుకూరు ప్రభుత్వ వైద్యశాలలో శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ విధినిర్వహణలో ఉన్న మహిళ కండక్టర్ పై రాక్షసంగా ప్రవర్తించిన పత్తిపాటి హరిబాబుని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. జనం అందరూ చూస్తుండగానే మహిళపై పైశాచికంగా ప్రవర్తించిన వ్యక్తిని కఠినంగా శిక్షించకపోతే మహిళా ఉద్యోగులు అభద్రతాభావంతో ఉద్యోగం చేయవలసి వస్తుందని ఆయన అన్నారు. హరిబాబుని కఠినంగా శిక్షించని ఎడల ఆందోళన చేపట్టవలసి వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రకాశం జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ వెంకట్రావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ డి యాసిన్, నెల్లూరు జిల్లా సిపిఐ సహాయక కార్యదర్శి మాలకొండయ్య, కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బి.సురేష్ బాబు, సహాయక కార్యదర్శి బాల కోటయ్య ,ఎస్టీయూ రాష్ట్ర నాయకులు సిహెచ్ ఆదినారాయణ, ఎంప్లాయిస్ యూనియన్ నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డివై కొండలు, ఉపాధ్యక్షులు బాబురావు, కందుకూరు డిపో అధ్యక్షులు మహేష్, సెక్రటరీ ఎం ఎస్ ఎన్ రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ శివకృష్ణ, జాయింట్ సెక్రెటరీ ఎస్. కె ఖాజావలి, కనిగిరి నియోజకవర్గ సిపిఐ సహయ కారదర్శి జిపి రామారావు తదితరులు పాల్గొన్నారు.



