విజయవంతంగా ముగిసిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ టైక్వాండో బాల బాలికల పోటీలు
BSBNEWS - KANDUKUR
ఈనెల 16, 17 తేదీలలో స్థానిక ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలో సబ్ జూనియర్ బాలబాలికల రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ముగిసాయని జిల్లా కార్యదర్శి ఎస్కే అబ్దుల్ సలాం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ వెంకటేశ్వర్లు పాల్గొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి చదువులతోపాటు క్రీడాలలో కూడా రాణించాలని తెలియజేశారు. అబ్దుల్ సలాం మాట్లాడుతూ ఈ పోటీలలో చాంపియన్షిప్ కడప జిల్లా కైవసం చేసుకొనగా రన్నర్ ఆఫ్ ఛాంపియన్షిప్ ఈస్ట్ గోదావరి జిల్లా సాధించినట్లు తెలియజేశారు. ఈ పోటీలలో బంగారు పతకం సాధించిన క్రీడాకారులు ఈనెల 28 నుండి డిసెంబర్ 2 వరకు హర్యానాలో జరగబోవు జాతీయస్థాయి టైక్వాండో పోటీలలో పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎల్.టి చంద్రమౌళి, జిల్లా అధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కంచర్ల రామయ్య, కరస్పాండెంట్ కంచర్ల విజయ శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త గోనుగుంట్ల వెంకటేశ్వరరావు, బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్, ప్రముఖ వ్యాపారవేత్త సయ్యద్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

