ప్రైవేటు ఎరువుల షాపులు తనిఖీ
BSBNEWS - KANDUKUR
పట్టణ పరిధిలోని అన్ని ప్రైవేటు విత్తన, ఎరువులు, పురుగు మందుల షాపులను మండల వ్యవసాయాధికారి వి రాము ఆధ్వర్యంలో కావలి సహాయ వ్యవసాయ సంచాలకులు (ఎ డి ఎ) డాక్టర్ సి హెచ్ నాగరాజు తనిఖీ చేసి పరిశీలించారు. కందుకూరు పట్టణం లోని ప్రైవేట్ ఎరువుల షాపులను తనిఖీ చేసి అధీకృత ఎరువుల తయారీ నుండి లైసెన్సు నందు పొందుపరచని ఫారం (ఓ) ఎరువులను, ఈ-పాస్ మిషన్ లోని నిల్వలు, రిజిష్టర్ లోని నిల్వలు సరిపోలేదని ఎరువుల యజమానికి తెలియజేసి రూ 3,02,744.00 పై /-విలువైన యూరియా 5.95 మెట్రిక్ టన్నులు, 20:20:0:13 - 8.700 మెట్రిక్ టన్నులు, 13:0:45 (60కేజి), 19:19:19(60కేజి) తాత్కాలికంగా అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ప్రైవేటు డీలర్లు అందరూ షాపుల ముందు డీలర్ షాపు పేరు, లైసెన్సు నంబర్, అడ్రస్ బోర్డు చూపించాలని, తప్పనిసరిగా మీ యెుక్క లైసెన్సులో ఎరువులను సరఫరా చేసే కంపెనీల ఉత్పత్తులను ఫారం(ఓ) ద్వారా పొందుపరచుకోవాలని , ఎరువులు ఎం ఆర్ పి ధరకు మాత్రమే విక్రయించాలని, రైతుకు రశీదు ఇవ్వాలని, నోటీసు బోర్డు లో అమ్మకపు ధరలు, ఎరువుల నిల్వ చూపించాలని , బిల్ బుక్ లో రైతు సంతకం, డీలర్లు సంతకం వుండాలని, పాస్ పుస్తకంలో రైతు విస్తీర్ణం బట్టి, బయోమెట్రిక్ ఆధారంగా వేలిముద్ర వేసుకొని ఎరువులను పంపిణీ చేయాలని తెలియజేసారు. నిబంధనలు లేనియెడల అట్టి వారిపై ఎరువుల చట్టం-1985 ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తదుపరి ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా నిల్వ ఉన్న ఎరువులు, భౌతికంగా నిల్వ ఉన్న ఎరువులను పరిశీలించారు. తదుపరి ఎరువుల బస్తాలను నికర తూకం సరిగా వుందో లేదో అని పరిశీలించి రైతులకు వివరించారు. తెలియజేసిన వివరాల ప్రకారం రైతులు గమనించి వ్రాత పూర్వకంగా మీ మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేసి, తగు సూచనలు సలహాలు పొందవచ్చని తెలియజేసారు.

