సుందరయ్య నగర్ సమస్యలు పరిష్కరించాలి

0

 సుందరయ్య నగర్ సమస్యలు పరిష్కరించాలి- సిపిఎం

BSBNEWS - KANDUKUR 

కందుకూరు పట్టణంలోని ఆరో వార్డు సుందరయ్య నగర్ నందు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కందుకూరు మున్సిపల్ కమిషనర్ కు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ఎస్ఏ గౌస్ మాట్లాడుతూ కందుకూరు పట్టణానికి సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం కోసం ఆసమయంలో అక్కడ నివాసం ఉంటున్న పేదల ఇల్లు తొలగించి పక్కనే ఇళ్ల స్థలాలు ఇచ్చి రామతీర్థం నుండి కందుకూరు పట్టణానికి పరిసర ప్రాంతాలకు పైప్లైన్ ద్వారా మంచినీటి వసతి కల్పించారన్నారు. సమ్మర్ స్టోరేజీ ఆనుకొని పక్కనే ఉన్న సుందరయ్య నగర్ లింబిని వనానికి మంచినీళ్ల పైప్ లైన్ గాని, కొళాయి కనెక్షన్ గాని కల్పించలేదన్నారు. సమ్మర్ స్టోరేజీ నిర్మాణం కోసం నివాసం ఉంటున్న ఇళ్లను తొలగించి పక్కనే ఇల్లు నిర్మించుకోమని స్థలం చూపించారన్నారు. ఆ సందర్భంలో ప్రజా ప్రతినిధులు   అధికారులు మాట్లాడుతూ సుందరయ్య నగర్ కాలనీ మోడరన్ కాలనీ చేస్తాము అని అన్నారని గుర్తు చేశారు. ఆచరణలో ఇప్పటివరకు మున్సిపాలిటీ ట్యాంకర్ ద్వారా చాలీచాలని నీళ్లు పంపిస్తున్నారే తప్ప శాశ్విత పరిష్కారం  చేయటం లేదని అన్నారు. వీటితోపాటు పారిశుద్ధ్య సమస్య అనేక సమస్యలు ఉన్నాయని ఈ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని కోరారు. కమిషనర్ కే.అనుష మాట్లాడుతూ తక్షణమే మంచినీటి పైప్ లైన్ నిర్మాణం చేపడతామని తెలియజేశారు. మిగిలిన సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ కి సిపిఎం పట్టణ కమిటీ ధన్యవాదాలు తెలియజేసినది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు టి వెంకట్రావు, ఎస్.కె మల్లిక, ఎం.పద్మ, ఏం.రాయుడు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments
Post a Comment (0)