సీఎంని కలిసిన వేమిరెడ్డి దంపతులు - ప్రశాంతి రెడ్డి కి టిటిడి బోర్డు మెంబర్‌ గా అవకాశం కల్పించడంపై ధన్యవాదాలు

0

 సీఎంని కలిసిన వేమిరెడ్డి దంపతులు    - ప్రశాంతి రెడ్డి కి టిటిడి బోర్డు మెంబర్‌ గా అవకాశం కల్పించడంపై ధన్యవాదాలు

BSBNEWS -AMARAVATI 

కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సోమవారం అమరావతిలోని సీఎం నివాసానికి వేమిరెడ్డి దంపతులు సీఎం ని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. టిటిడి బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించడంపై సీఎంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవదేవుడి సేవకు అవకాశం రావడం సంతోషంగా ఉందని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా శ్రీవారి భక్తులకు సేవ చేస్తామని వారు స్పష్టం చేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)