అగ్రహారంలో వీధి దీపాల మరమ్మత్తులు
BSBNEWS - PONNALUR
మండలంలోని అగ్రహారం గ్రామంలో సర్పంచ్ షేక్ చిన మస్తాన్ విధి దీపాలకు మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో వీధి దీపాలు మరమ్మత్తులకు గురయ్యా అని ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో వెంటనే వాటికి మరమ్మతులు చేయడం జరిగిందని అన్నారు. పూర్తిగా పనికిరాని ఇరిగిపాలను తీసివేసి నూతన వీధి దీపాలను ఏర్పాటు చేయటం జరిగింది అని అన్నారు. గ్రామంలో ఏ చిన్నపాటి సమస్య వచ్చినా నేరుగా నా దృష్టికి తీసుకు సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి వంగపాటి రామాంజనేయులు పాల్గొన్నారు.

.jpeg)