పోకురులో పొలం పిలుస్తోంది
BSBNEWS - VALETEVARIPALEM
మండలంలోని పోకూరు గ్రామం లోని రైతు సేవా కేంద్రం నందు పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి ఎం హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా ఆత్మ పిడి డాక్టర్ శివ నారాయణ, నెల్లూరు జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి ఇ.శైలజా కుమారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ జి.శివ నారాయణ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాఖ వారి సలహాలు పాటించకుండా విచ్చలవిడిగా ఎరువులు పురుగుమందులు వాడటం వలన వ్యవసాయంలో సాగు ఖర్చు పెరిగి మిత్ర పురుగులు నశించి పంటలు దిగుబడును తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. రైతులు దీని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ వారి సలహాలు సూచనలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పద్ధతులుపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. రైతులందరూ క్రమేపి తగ్గించి సేంద్రీయ ఎరువులు వాడకం పెంచాలని రైతులకు సూచనలు ఇచ్చారు. జిల్లా వనరుల కేంద్రం నుండి వచ్చిన వ్యవసాయ అధికారిని ఈ.శైలజా కుమారి మాట్లాడుతూ మినుము పంటలో సమగ్ర సస్యరక్షణ గురించి వివరించారు. ఈ వర్షాలకి తెగుళ్లు, పురుగులు ఎక్కువ ఆశిస్తాయని, ముఖ్యంగా లద్దె పురుగు నివారణకు ఎకరాకు పది లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసుకొని తూర్పు ఉదృతిని నివారించాలి అని అన్నారు. గ్రుడ్లు సముదాయలను ఏరి వెయ్యాలి ఎకరాకు ఎన్ పి వి 200 ఎం ఎల్ ఈ ద్రావణం సాయంకాలం సమయంలో పిచ్చికారి చేసుకోవాలని సూచించారు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పొలంలో విషపు ఎర్రలు వెదజల్లుకోవాలని తెలిపారు. ఎకరాకు మోనోక్రోటోఫాస్ 500 ఎం ఎల్ లేదా క్లోరి పైరిఫాస్ 500 ఎం.ఎల్ ఐదు కిలోల తౌడు, అరకిలో బెల్లం సరిపడే నీటిలో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయంత్రం సమయంలో పొలం మొత్తం వెదజల్లాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు పి శ్రీకాంత్ రెడ్డి, ఉద్యానవన సహాయకులు ఖాదర్ భాషా గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

