మేధస్సుకు పదును పెట్టేది గ్రంధాలయాలే
BSBNEWS - KANDUKUR
57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సందర్భంగా కందుకూరు పట్టణంలోని శాఖా గ్రంధాలయం నందు వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థిని, విద్యార్థులకు బుధవారం బహుమతులను పాలపిట్ట దీర్ఘ కావ్య రచయిత ముప్పవరపు కిషోర్ అందజేశారు. ఈ సందర్భంగా పాలపిట్ట దీర్ఘ కావ్య రచయిత ముప్పవరపు కిషోర్ మాట్లాడుతూ ప్రపంచంలో సమస్త జ్ఞానం పుస్తకాల్లో నిక్షిప్తమై ఉన్నదని, తాత్విక శాస్త్ర సాంకేతిక సాహిత్య సాంస్కృతిక విజ్ఞానం లైబ్రరీలో దొరుకుతుందని అన్నారు. జాతీయోధ్యమం, జాతీయ సమైక్యతకు గ్రంథాలయం ప్రముఖంగా తోడ్పడింది అని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన దండోరా దాసు మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయుటంలో గ్రంధాలయాలు తోడ్పడుతున్నాయని తెలిపారు. దమ్మ చక్ర ఫౌండేషన్ అధ్యక్షులు ఉపాసక గాండ్ల హరిప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయాల్లో ఉన్న గ్రంధాలను అధ్యయనం చేసి మంచిని స్వీకరించాటానికి గ్రంథాలయం ఉపయోగపడుతుందని అన్నారు. సీనియర్ న్యాయవాది పోకూరి కోటయ్య మాట్లాడుతూ ప్రపంచం విజ్ఞానంలో చాలా ముందుకు వెళుతుందని విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకొనుటకు గ్రంథాలయాలను విరివిగా ఉపయోగించుకోవాలని తెలియజేశారు. గ్రంథపాలకురాలు పి.నాగరజని మాట్లాడుతూ గత వారం రోజులుగా కందుకూరు శాఖా గ్రంధాలయంలో నవంబర్ 14 బాలల దినోత్సవం నుండి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించామని పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులకు పాటల పోటీలు, వకృత పోటీలు, వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు, చిత్రలేఖన పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పోటీలలో పాల్గొని విజయం సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ముగింపు రోజు సందర్భంగా బహుమతులను పట్టణ ప్రముఖుల చేతుల మీదుగా అందజేయడం జరిగిందన్నారు. అనంతరం వారోత్సవాల సందర్భంగా సహకరించినటువంటి పట్టణ ప్రముఖులకు గ్రంధపాలకురాలు దృశ్యాలువ కప్పి చిరు సత్కారం చేయడం జరిగినది. ఈకార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బందితో పాటు చైతన్య స్కూల్ ఉపాధ్యాయులు సుబ్బారావు, ఎస్ కే భాష, చిన్న, పలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థుల తో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు. బహుమతులు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.



.jpeg)