రాళ్లపాడు ప్రాజెక్టు సమస్యలపై తొలిసారి అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే ఇంటూరి

0

రాళ్లపాడు ప్రాజెక్టు సమస్యలపై తొలిసారి అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే ఇంటూరి

BSBNEWS - KANDUKUR 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో  కందుకూరు ప్రజల జీవనాడి రాళ్లపాడు ప్రాజెక్టు సమస్యలపై  అసెంబ్లీలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తొలిసారి మాట్లాడారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గ ప్రజల జీవనాడి రాళ్లపాడు ప్రాజెక్టుకు సోమశిల ప్రాజెక్టు నుంచి గొట్టిపాటి కొండపనాయుడు నార్త్ కెనాల్ ద్వారా 1.5 టీఎంసీలు నీరు రాళ్లపాడు ప్రాజెక్టుకు రావాల్సి ఉంది అని, కానీ ప్రస్తుతం ఆ కాలువ లో నీటిపారుదల సరిగా లేక 0.5 టిఎంసి నీరు మాత్రమే ప్రాజెక్ట్ చేరటం ద్వారా పూర్తిస్థాయిలో నీరు రాక కందుకూరు నియోజకవర్గ రైతాంగం పంటలు పండించేందుకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. రాళ్లపాడు ప్రాజెక్టు సంబంధించిన 2018వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మా స్వగ్రామమైన బడేవారిపాలెం పర్యటనలో రాళ్లపాడు ఎడమ కాలువ పనులకు సంబంధించిన  జీవో నెంబర్ 116 ద్వారా ఎడమకాలువ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ ఎడమ కాలువ పనులు పూర్తి అయితే వలేటివారిపాలెం మండలం, లింగసముద్రం మండలంలోని వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు. కానీ గత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులపై ఎటువంటి పురోగతి లేదని ధ్వజమెత్తారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రాళ్లపాడు ప్రాజెక్టును డి ఐ పి ఇరిగేషన్ పథకంలో ప్రాజెక్ట్ అభివృద్ధి చేయాలని నిర్ణయించారన్నారు. కానీ గత ప్రభుత్వంలో ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. ప్రాజెక్ట్ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిని ఆయన కోరారు. ముందుగా తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడుకి, యువ నాయకులు నారా లోకేష్ కి, కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో రాళ్లపాడు ప్రాజెక్టు సమస్యలపై ప్రస్తావించినందుకు ఎమ్మెల్యేకు రాళ్ళపాడు ఆయకట్టు రైతాంగం అభినందనలు తెలియజేశారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)