రైతు సేవా కేంద్రాలలో పంట నమోదు చేసుకోవాలని

0

రైతు సేవా కేంద్రాలలో పంట నమోదు చేసుకోవాలని

BSBNEWS - KANDUKUR 


పంట వేసిన వెంటనే రైతు సేవా కేంద్రాలలో పంట నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వి.రాము కోరారు. మండలంలోని పలుకూరు, మహదేవపురం గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయాధికారి వి. రాము ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వి.రాము మాట్లాడుతూ శనగ వేసే రైతులు తప్పనిసరిగా ట్రీకోడర్మా విరిడి పౌడరు 10గ్రాములు కేజి విత్తనంతో కలిపి విత్తన శుద్ధి చేసి వితుకోవాలని సూచించారు.  రబీ సీజన్లో వేసిన పంటలకు భీమా చేయించుకోవాలని తద్వారా భీమా ( టాటా ఇన్సూరెన్స్)వర్తిస్తుందని తెలియజేసారు. ఎకరాకు వరికి రూ 168.00,మినుము 38.00, శనగ 56.00, వేరుశనగ 60.00 డిసెంబర్ 15లోపల, వరికి మాత్రం డిసెంబర్ 31 లోపల ప్రీమియం చెల్లించాలని తెలియజేసారు. తదుపరి మినుము పంటను పరిశీంచి, మినులో కలుపును ఎప్పటికప్పుడు మనుషులతో తీసుకోవాలని సూచించారు. మినుములో రసం పేల్చే పురుగులు నివారణకు బ్లూ, పసుపు జిగురు అట్టలు ఎకరాకు 20 చొప్పున పెట్టుకొని, వేప నూనె 5-10 మి. లీ ఒక లీటర్ నీటికి, మోనోక్రోటోఫోస్ 1.6మీ. లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి అని తెలిపారు. 19:19:19 ఒక కేజి ఎకరాకు కలిపి పిచికారి చేయాలి అని సూచించారు. తుప్పు మచ్చ తెగులు నివారణకు మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 2.5గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ అధికారి షేక్ ఖాసిం, పలుకూరు గ్రామ ఉద్యాన సహాయకులు ఐ.బ్రహ్మీని, మహాదేవపురం గ్రామ వ్యవసాయ సహాయకులు షేక్. నజీర్ భాష , పలుకూరు ఎంపిటిసి స్వర్ణ పున్నయ్య, రెండు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)