చుండి ఆదర్శ పాఠశాలలో సైబర్ నేరాలు చట్టంపై అవగాహన సదస్సు

0

 చుండి ఆదర్శ పాఠశాలలో సైబర్ నేరాలు చట్టంపై అవగాహన సదస్సు 


BSBNEWS - VALETEVARIPALEM 

మండలంలోని చుండి గ్రామంలో ఉన్న ఆదర్శ పాఠశాల లో శుక్రవారం విద్యార్థులకు సైబర్ నేరాలు, ఫోక్సో 2012 చట్టంపై మండల ఎస్సై మర్రి నాయుడు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై పిల్లలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 2012 ఫోక్సొ చట్టం మీద అవగాహన కల్పిస్తూ విద్యార్థులందరూ చాలా జాగ్రత్తలతో ఉండాలని ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా విద్యపై దృష్టి పెట్టి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్లాలని అన్నారు. సైబర్ నేరాలు ఫోక్సో చట్టం వలన కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి.వెంకటేశ్వర్, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)