మహిళా మంత్రే మహిళలను అవమానపరచటం సరైనది కాదు.

0

 మహిళా మంత్రే మహిళలను అవమానపరచటం సరైనది కాదు. 

తక్షణమే మహిళా మంత్రి మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. 

 వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాళ్ళ డిమాండ్ 

BSBNEWS - KANDUKUR 

శాసన మండలి సమావేశాల్లో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ బీసీ సంక్షేమ, చేనేత శాఖా మంత్రి సవిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కందుకూరు వైయస్సార్సీపి  మహిళా విభాగం సీనియర్ నాయకురాళ్ళు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనమండలి సాక్షిగా  మహిళలను చులకనగా మాట్లాడటం ఒక మహిళా మంత్రిగా సవితకు భావ్యం కాదని, మహిళగా ఉన్నత స్థాయి హోదాలో ఉండి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తక్షణమే మహిళా మంత్రి మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము అని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి మహిళా సాధికారత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను మహిళలని లబ్ధిదారులుగా చేసి వారి అభివృద్ధి కోసం పాటుపడ్డారన్నారు. మహిళలకు నేరుగా వారి అకౌంట్లోకి డబ్బు జమ చేయడం వలన వారి కుటుంబాలు రాష్ట్రంలో బాగుపడిన సంగతి అందరికీ విదితమే. బటన్ నొక్కి మహిళల అకౌంట్లోకి నగదు జమ చేయుట వలన వారు సోమరిపోతులుగా మారారని, యువత, మహిళలు మత్తు పదార్థాలకు బానిసలు అయ్యారని మాట్లాడటం అవివేక చర్య అవుతుందన్నారు. మహిళల పట్ల సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలను సరి చేయవలసిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరైనది కాదని ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మహిళా విభాగం సీనియర్ నాయకురాలు తలారి ప్రసన్న కుమారి, మాజీ కౌన్సిలర్ షేక్ కరీమునిషా, జె సి ఎస్ కన్వీనర్  దేవరకొండ ఆదిలక్ష్మి, వైసీపీ నాయకురాలు తన్నీరు ధరణి  తదితరులు ఉన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)