పలు పోలీస్ స్టేషన్ లను సందర్శించిన జిల్లా ఎస్పీ

0

 పలు పోలీస్ స్టేషన్ లను సందర్శించిన జిల్లా ఎస్పీ

BSBNEWS - KANDUKUR 




నియోజక వర్గంలోని కందుకూరు డిఎస్పీ, పట్టణ, రూరల్, ఉలవపాడు వలేటివారిపాలెం పోలీస్ స్టేషన్ లను జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా కందుకూరు సబ్ డివిజన్ ఆఫీసు, కందుకూరు టౌన్, రూరల్, ఉలవపాడు స్టేషన్ ల పరిధిలోని గ్రేవ్ కేసుల రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసు స్టేషన్స్ మ్యాప్, చార్ట్ ను, స్టేషన్ పరిధిలో ఉన్న పరిస్థితులు, శిధిలావస్థలో ఉన్న వాహనాలను పరిశీలించి, కోర్టు అనుమతితో వేలం వేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసు సిబ్బంది, అధికారుల సంక్షేమం, సమస్యలపై ఆరా తీశారు. ఎస్సీ, ఎస్టి, పిఓసిఎస్ఓ, హత్య, లైంగిక, వరకట్న వేధింపుల కేసులపై పలు సూచనలు చేసి, అలసత్వం లేకుండా దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిందితులకు కోర్టులో కఠిన శిక్షలు పడాలన్నారు. హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశాలు జారీ చేసారు.  సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలను తగ్గించాలన్నారు. ప్రత్యేక బృందాలతో కోల్పోయిన ప్రాపర్టీ రికవరీపై దృష్టి సారించాలన్నారు. నేరాల నియంత్రణకు రౌడీ షీటర్స్, పాత నేరస్తులపై నిఘా ఉంచి, వారికి తప్పక కౌన్సెలింగ్ ఇవ్వాలి అని తెలిపారు. గ్రామాలను సందర్శించి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని, స్కూల్స్, కళాశాలలో క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్, సైబర్ నేరాలు, చట్టాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసు స్టేషన్ సిబ్బంది యొక్క యోగ క్షేమాలు అడిగి, ఏమైనా సమస్యలు ఉన్నాయా? వారి యొక్క గ్రీవెన్స్ ను అడిగి, విధుల పట్ల అలసత్వం వహించవద్దని, నిబద్ధత కలిగి విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఈ సందర్శనలో జిల్లా యస్. పి. గారు, ఎస్ బి డిఎస్పీ శ్రీనివాస రావు, సంబంధిత సబ్ డివిజన్ అధికారులు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)