శామీర్ పాలెం, పోలినేనిపాలెం గ్రామంలో పొలం పిలుస్తోంది

0

 శామీర్ పాలెం, పోలినేనిపాలెం గ్రామంలో పొలం పిలుస్తోంది 

BSBNEWS - VALETIVARIPALEM 

మండలంలోని శామీర్ పాలెం, పోలినేనిపాలెం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి ఎం.హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కందుకూరి వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ పి. అనసూయ పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం మినుము పంట శాఖీదశ నుండి పూత దశలో పూత నుండి కాయ దశలో ఉన్నదన్నారు. మినుము పంటలో సమగ్ర సస్యరక్షణ గురించి వివరించారు. ఈ వర్షాలకి తెగుళ్లు, పురుగులు ఎక్కువ ఆశిస్తాయన్నారు. ముఖ్యంగా లద్దె పురుగు నివారణకు ఎకరాకు పది లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసుకొని తూర్పు ఉదృతిని నివారించాలన్నారు. గ్రుడ్లు సముదాయలను ఏరి వెయ్యాలి అని, ఎకరాకు ఎన్ పి వి 200 మిల్లీమీటర్లు ఈ ద్రావణం సాయంకాలం సమయంలో పిచ్చికారి చేసుకోవాలని సూచించారు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పొలంలో విషపు ఎర్రలు వెదజల్లుకోవాలని తెలిపారు. ఎకరాకు మోనోక్రోటోఫాస్ 500 మిల్లీమీటర్లు లేదా క్లోరి పైరిఫాస్ 500 మిల్లీమీటర్లు  ఐదు కిలోల తౌడు, అరకిలో బెల్లం సరిపడే నీటిలో కలిపి చిన్న ఉండలుగా చేసి  సాయంత్రం సమయంలో పొలం మొత్తం వెదజల్లాలి అని  తెలిపారు. సహాయ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ పి అనసూయ మాట్లాడుతూ కందుకూరు వ్యవసాయ సబ్ డివిజన్లో ప్రస్తుతం మినుము, వరి, పొగాకు, శనగ పంట సాగులో ఉన్నవి అని, రానున్న రెండు మూడు రోజుల్లో తుఫాను హెచ్చరిక ఉన్నది అని,  దానివల్ల తేలికపాటి నుండి ఒక అధిక వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేశారన్నారు. రైతులందరూ కూడా తప్పనిసరిగా వ్యవసాయ శాఖ సలహాలు, సూచనలు పాటించాలని తెలిపారు. వరి నాట్లు వేసుకోదలిచినవారు రెండు మూడు రోజులు వాయిదా వేసుకుని వర్షం అనంతరం వేసుకోవలసినదిగా  తెలిపారు. శనగ విత్తనాలు విత్తుకునే రైతులు వాయిదా వేసుకుంటే మంచిది అని తెలిపారు. మినుము పంటలో నీరు నిలబడి ఉంటే కాలవలు చేసుకుని నీటిని బయటికి వెళ్ళకట్టుకోవాలి అని, అనంతరం  ఎకరనికి ఒక కేజీ 19:19:19 , శిలేంద్ర నాసినీ మందులతో పిచికారి చేసుకోవాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ నుండి డాక్టర్ పి.వంశీ వెటర్నరీ డాక్టర్ పాల్గొని పశుసంవర్ధక శాఖ ద్వారా అమలయ్యే కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం పోలిలేనిపాలెం గ్రామంలో రైతులతో కలిసి వరి పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పోలినేనిపాలెం ఎంపీటీసీ చింతలపూడి రవీంద్ర, గ్రామ సర్పంచ్ అనుముల అమరేశ్వరి, గ్రామ వ్యవసాయ సహాయకులు షేక్. అఫ్రీన్, సురేష్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)