సీనియర్ జర్నలిస్టు రవికుమార్ మృతి దిగ్భ్రాంతి కలిగించింది
- కే జే ఏ (కందుకూరు జర్నలిస్ట్ అసోసియేషన్) నాయకులు
BSBNEWS - VALETEVARIPALEM
సీనియర్ జర్నలిస్టు సి.హెచ్ రవికుమార్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని కె జే ఏ (కందుకూరు జర్నలిస్ట్ అసోసియేషన్) అధ్యక్షులు యర్రంశెట్టి ఆనందమోహన్ తెలిపారు. వలేటివారిపాలెం గ్రామంలో బుధవారం రవికుమార్ నివాసానికి కే జే ఏ గౌరవ అధ్యక్షులు గౌడ పేరు రాము, అధ్యక్షులు ఆనందమోహన్, ప్రధాన కార్యదర్శి ద్రోణాదుల చైతన్య, ఉపాధ్యక్షులు బొజ్జా చంద్రమోహన్, నాయకులు బూసి సురేష్ బాబు, మరిపూడి అంజయ్య లు వెళ్లి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిహెచ్ రవికుమార్ గుండెపోటుతో మృతి చెందటం ఎంతో బాధాకరమని అన్నారు. ఆయన విశాలాంధ్ర, ప్రజాశక్తి, హైదరాబాదు మిర్రర్, సూర్య దినపత్రికలలో వివిధ స్థాయిల్లో పనిచేశారని వారు గుర్తు చేశారు. రవి కుమార్ సుమారు 20 సంవత్సరాల పైగా పత్రిక రంగంలో పనిచేస్తూ పత్రికా రంగం ద్వారా సమాజానికి సేవలు అందించిన రవి అకాల మృతికి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

