బాలుర పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

0

బాలుర పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

BSBNEWS - KANDUKUR 

స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు బాలల దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు ఎం.నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి  పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఎం నరసింహమూర్తి మాట్లాడుతూ భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అని, ఆయన పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ కి బాలల అంటే ఎంతో ఇష్టమని అందువలన ఆయన పుట్టినరోజున బాలల దినోత్సవం జరుపుకుంటారని విద్యార్థులకు తెలిపారు. పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టిన ఘనత నెహ్రూదేనని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు విప్రనారాయణ కజిన్ బ్రదర్ అయిన  శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మాజీ అధ్యక్షులు కుమారుడు కొత్త నరేంద్ర కుమార్ విద్యార్థులకు సుమారు 2000 రూపాయలతో అల్పాహారాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఇలాంటి సేవా సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న నరేంద్ర కుమార్ ను  అభినందించి ఘనంగా సన్మానించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అసిస్టెంట్ ఎం రమణయ్య, సైన్స్ ఉపాధ్యాయులు విప్రనారాయణ, సీనియర్ ఉపాధ్యాయులు మాధవరెడ్డి, పెరుగు ప్రసాద్, షేక్ సంధాని భాష, బి బాపయ్య, పి మురళీకృష్ణ, డి సుధాకర్, గుడ్లూరు వెంకటేశ్వరరావు, వి శ్రీనిధి, కే రాంబాబు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)