కందుకూరు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం

0

కందుకూరు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం 

BSBNEWS - KANDUKUR 

భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ  జయంతిని పురస్కరించుకుని గురువారం కందుకూరు వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో కృష్ణ నగర్ కాలనీ లోని ఎంపీపీ పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్ నాయకులు మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులకు వాటర్ బాటిల్స్, బాల్స్, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. నెహ్రు కి చిన్నపిల్లలు అంటే ఎంతో ఇష్టం అని అందువల్లనే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ లెజెండ్స్ ప్రెసిడెంట్ సేవా హ్రుదయ రవ్వా శ్రీనివాసులు(ఎల్ ఐ సి ఏజెంట్), ట్రెజరర్ చీధెళ్ళ క్రృష్ణ, వాసవి వనిత క్లబ్ ప్రెసిడెంట్ కొత్తూరి నటరాజకుమారి, సెక్రటరీ నారాయణ సుకన్య, ట్రెజరర్ పేరూరి లలిత, ఆర్.సి.ఎ. గుర్రం మంజుల కుమారి, జెడ్. సి. కోట వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)