పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేసిన టిడిపి నాయకులు

0

పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేసిన టిడిపి నాయకులు 

BSBNEWS - KANDUKUR 

టివి 5 చైర్మన్, టీటీడీ దేవస్థానం చైర్మన్ బి ఆర్ నాయుడుపై పోసాని కృష్ణ మురళి చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్థానిక టిడిపి నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణ మురళి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి సోషల్ మీడియా గత వైసిపి ప్రభుత్వం లోను ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసిపి నాయకులు ప్రవర్తిస్తున్నారని వాటిని అరికట్టి ప్రశాంత వాతావరణంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతుంటే వాటిని వ్యంగ్యంగా వక్రీకరించి వైసిపి ప్రభుత్వం ప్రజలను పక్కదారి పట్టిస్తుందని వారు మండిపడ్డారు. పోసాని కృష్ణ మురళి టీవీ 5 చైర్మన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు పునరావతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో అసభ్య పదజాలంతో దూషిస్తూ పాలన సాగించిన వైసిపి అదే తీరులో ప్రస్తుతం ముందుకు సాగాలంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు దామల్లేశ్వరరావు ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీనివాసులు టిడిపి నాయకులు బెజవాడ ప్రసాద్,మహర్షి తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)