వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ఇంటూరి భేటీ
BSBNEWS - KANDUKUR
కందుకూరు నియోజకవర్గంలోని 5 మండలాల వ్యవసాయ అధికారులతో శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ రైతులకు ఎరువులు సకాలంలో అందించాలని, వ్యాపారస్తులు ఎరువులను ఎమ్మార్పీ ధరకు మాత్రమే విక్రయించాలని, ఎక్కువ ధరలకు విక్రయించకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆర్.బి.కె కేంద్రాల్లో రైతులకు సరిపడా ఎరువులు నిల్వ ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి అనసూయ, మండల వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

