అధికార దర్పం
BSBNEWS - KANDUKUR
కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం పలు విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్తే స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వ్యవసాయ అధికారుల సమీక్ష సమావేశంలో ప్రభుత్వ అధికారులకు చుక్కెదురైంది. రైతాంగ సమస్యల కోసం నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ అధికారులను పిలిపించిన స్థానిక ఎమ్మెల్యే వారికి కనీసం కుర్చీలు కూడా వేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంపై పలు అధికారులు పెదవిరవటం నియోజకవర్గంలో చర్చనీయాంసంగా మారింది.

