టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి

0

 టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి 

BSBNEWS - KANDUKUR 


నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టిడిపి పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 134 వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి  ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సంఘసంస్కర్త గా ఎన్నో సేవలు అందించారు అని అన్నారు. భారతదేశంలో మహిళా విద్యకు కృషిచేసి సమాజంలో అసమానతలపై, అంటరానితనంపై, అస్పృశ్యత, కుల వివక్షకు వ్యతిరేకంగా మహిళా సాధికారత కోసం పోరాటం చేసి సామాజిక సమానత్వానికి పునాది వేసిన సామాజికతత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, చిలకపాటి మధుబాబు, చదలవాడ కొండయ్య, గోచిపాతల మోషే, షేక్ రఫీ, మహర్షి శ్రీను, షేక్ రూబీ, కూనం నరేంద్ర, చుండూరి శ్రీనివాసులు, ముచ్చు వేణు,  షేక్ సలాం, మోదడుగు వెంకటేశ్వర్లు,  ముప్పవరపు వేణు, పసుపులేటి రమణయ్య, చిత్తారి మల్లికార్జున, పువ్వాడి వెంకటేశ్వర్లు నాదెండ్ల మధు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)