అంగన్వాడి కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవం
BSBNEWS - VALETEVARIPALEM
మండలంలోని అత్తింటివారిపాలెం అంగన్వాడీ సెంటర్ లో బాలల దినోత్సవం వేడుకలు కందుకూరు ప్రాజెక్ట్ వలేటివారిపాలెం 2సెక్టార్ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీడీపీఓ సూచనల మేరకు బాలలదినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినదన్నారు. చిన్నారులకు నెహ్రూ వేష ధారణలో చూపరును అలరించాయన్నారు. చాచా నెహ్రూ కి పిల్లలంటే ఎంతో ఇష్టం అందుకని ఆయన జన్మ దినోత్సవం రోజున బాలల దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. పిల్లలకి ప్రేమ, నాణ్యమైన విద్య, సంరక్షణ అందివ్వడం బాలలదినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకి పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏ డబ్ల్యు. డబ్ల్యు కె.రాధ, పి. భారతి, పి. రమాదేవి, ఏ డబ్ల్యు హెచ్ కె.ప్రసన్న, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

