గోకులం షెడ్ల మంజూరుకు శ్రీకారం
BSBNEWS - KANDUKUR
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడిరైతుల సంక్షేమాభివృద్ధి కోసం చర్యలు చేపట్టింది అని ఎంపీడీవో వై. వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ గోకులం షెడ్ల మంజూరుకు శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాల్లో పశుపోషణ, కోళ్లు, గొర్రెలు, మేకలు పెంపకానికి మెరుగైన వసతి కల్పిస్తూ, పెంపకందార్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పశువుల నివాసానికి కొద్దిపాటి స్థలం ఉంటే మినీగోకులం పేరిట షెడ్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇటీవల పశుసంవర్ధకశాఖ అధికారులు గోకులం ఎంపిక ప్రక్రియకు చర్యలు చేపట్టడంతో పశుపోషకుల్లో ఆనందం వ్యక్తమవుతోందన్నారు.
గుడ్లూరు మండలానికి 21 గోకులం యూనిట్లు మంజూరు వచ్చినట్టు ఆయన తెలిపారు. షెడ్లకు అందించే నిధుల వివరాలు షెడ్డు పరిధి యూనిట్ విలువ రాయితీ రైతు వాటా
2 పశువులు రూ.1,15,000 రూ.1,03,500 రూ.11,500
4పశువులు రూ.1,85,000 రూ.1,66,500 రూ.18,500
6కన్నా ఎక్కువుంటే రూ.2,30,000 యూనిట్లు రూ.2,07,000 రూ.23,000
20గొర్రెలు, మేకలు రూ.1,30,000 రూ.91,000 బో రూ.39,000 50గొర్రెలు, మేకలు రూ.2,30,000 రూ.1,61,000 రూ.69,000, 100 కోళ్లు రూ.87,000 రూ.60,900 రూ.26,100, 200 కోళ్లు రూ.1,32,000 రూ.92,400 రూ.39,600 గుడ్లూరు మండల లో గుడ్లూరు, అమ్మవారిపాలెం, పూరేటిపల్లి, ఆర్ సి గ్రామాలలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో ఎస్.కె అబ్దుల్లా. ఈ సి .యు విజయ్ కుమార్ గుడ్లూరు సర్పంచ్ శంకర్ రైతులు తోపాటు ఎన్ ఆర్ జి ఎస్ సిబ్బంది పాల్గొన్నారు

