విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ
BSBNEWS - KANDUKUR
మండలంలోని వెంకటాద్రిపాలెం మండల పరిషత్ ప్రాథమిక జనరల్ పాఠశాల నందు చదువుతున్న విద్యార్థులందరికీ అంగన్ వాడీ కార్యకర్త మేకల స్వాతి వాటర్ బాటిళ్లు ను బుధవారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ బాటిల్స్ ను మండల విద్యాశాఖాధికారి కె సుబ్బారెడ్డి చేతుల మీదుగా విద్యార్థులందరికీ పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాటర్ బాటిళ్లను పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. వాటర్ బాటిల్స్ అందించిన దాత స్వాతి ని ఆయన అభినందించారు. దాతలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎంఈఓ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. వెంకటరావు, సహ ఉపాధ్యాయులు పి శారదా దేవి, వివి ప్రమీల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ
వెంకటాద్రిపాలెం ప్రాధమిక పాఠశాల ఆవరణంలో జరుగుతున్న అంగనవాడీ కేంద్రాన్ని ఎంఈఓ సుబ్బారెడ్డి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని రికార్డులు, రిజిస్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మధ్యాహ్న భోజనం మెనూ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్త స్వాతి, సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.

