అపార్ నమోదు త్వరగా పూర్తి చేయండి - ఆర్జేడి

0

అపార్ నమోదు త్వరగా పూర్తి చేయండి - ఆర్జేడి

BSBNEWS - KANDUKUR 


ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) నమోదు పక్రియను వేగవంతం చేయాలని  విద్యాశాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్జేడీ) బి. లింగేశ్వర రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణం లోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో అపార్ ఐడీ నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం జరగరాదన్నారు. మండలంలో ఆపార్ నమోదు తక్కువగా ఉన్న ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సలహాలు, సూచనలు చేశారు. అపార్ నమోదులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఆర్జేడి సూచించారు. అనంతరం ఆయా పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పాఠశాలల సిబ్బందిని ఆదేశించారు. అలా వచ్చినప్పుడే వారు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారన్నారు. ఆయా పాఠశాలల్లో జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాలలలో విద్యార్థులకు అందిస్తున్న డిజిటల్ విద్య బోధన గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అన్ని రంగాలలో తీర్చిదిద్ధాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఇఓ ఎంవి జానకిరామ్, ఎంఈఓలు కె.సుబ్బారెడ్డి, బి అజయ్ బాబు, హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)