ముమ్మరంగా సాగుతున్న టిడిపి సభ్యత్వ నమోదు
BSBNEWS - VALETEVARIPALEM
మండలంలోని అంక భూపాలపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమంను తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు బక్కమంతల మాల్యాద్రి, చెంచు శ్రీనివాసులు ఆరవ రోజు ఎస్సీ కాలనీలో ముమ్మరంగా కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు అంక భూపాలపురం తెలుగుదేశం పార్టీ సభ్యత్వo నమోదు కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్ పంది. లక్ష్మీనారాయణ మంగి సాల్మను మంగి.లాజరు మంగి ప్రకాశం తదితరులు పాల్గొన్నారు

